RRR టీజర్‌కు వాయిస్ ఓవర్ ఎవరో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న RRR సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన రాంచరణ్ పాత్రకు సంబంధించిన సీతారామరాజు ఫస్ట్‌లుక్, ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమురం భీం ఫస్ట్‌లుక్‌లు అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి.

CHIRU VOICE OVER RRR

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దీనిని విడుదల చేయనున్నారు. అయితే త్వరలో RRR టీజర్‌ను విడుదల చేసే అవకాశముంది. రాంచరణ్ ఫస్ట్‌లుక్‌ టీజర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పగా.. ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ టీజర్‌కు రాంచరన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. త్వరలో రానున్న RRR టీజర్‌కు సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది.

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న RRR టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పనున్నాడట.