డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా చిరు కానుక!!

మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తన అభిమాన హీరో పుట్టినరోజుని పురస్కరించుకొని ” చిరు కానుక ” అనే పాటని రూపొందించాడు. బాలాజీ ఈ పాటకు సాహిత్యం అందించగా ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాష్ ఖేర్ ఈ పాటని ఆలపించడం విశేషం. మహిత్ నారాయణ్ సంగీతం అందించిన ” చిరు కానుక ” పాటని Magic Axis అదినేత్రి రోష్ని నాడియాల్ నిర్మించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి , చిరు ఆశయాల గురించి సాగే ఈ పాటని దర్శకుడు బాబీ విడుదల చేసారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు బాబీ తో పాటుగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ , నిర్మాత రోష్ని నాడియాల్ ,చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ ” రామ్ చరణ్ బర్త్ డే కి ఓ పాటని రూపొందించాను . ఆ పాట చిరంజీవి గారికి బాగా నచ్చింది దాంతో ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. చిరంజీవి గారి ప్రోత్సాహం నాలో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇక ఇప్పుడేమో అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు కావడంతో ” చిరు కానుక ” అనే పాట చేసాం. Magic Axis అధినేత్రి రోష్ని గారు నిర్మించడానికి ముందుకు వచ్చారు. రోష్ని గారు అభిరుచి గల నిర్మాత ……. మంచి చిత్రాలు నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. ఇక ఈ పాట కూడా చిరంజీవి గారిని అమితంగా అలరిస్తుందన్న నమ్మకం ఉందని , మా పాట రిలీజ్ చేసిన దర్శకుడు బాబీ గారికి అలాగే స్వామి నాయుడు గారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

నిర్మాత రోష్ని మాట్లాడుతూ ” మహిత్ గారు వినిపించిన పాట నచ్చడంతో మెగాస్టార్ గారి కోసం ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఇదొక మంచి అవకాశంగా భావించి ఈ పాట రూపొందించడం జరిగింది. మా బ్యానర్ లో మంచి అభిరుచి గల చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు