మరో రికార్డు క్రియేట్ చేసిన చిరు ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 20 ఎకరాల్లో హైదరాబాద్‌లో కోకాపేటలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ఇండియాలోనే ఇంత పెద్ద సెట్ ఇప్పటివరకు ఏ సినిమాకు వేయకపోవడంతో.. ఇది రికార్డుగా నిలిచింది. కానీ ఇప్పుడు ఆచార్య మరో రికార్డును తన ఘాతాలో వేసుకుంది.

chiru acharya audio rights
chiru acharya audio rights

‘ఆచార్య’ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ రూ.4 కోట్ల భారీ రేటు పెట్టి దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకు ఏ సినిమా ఆడియో రైట్స్ ఇంత భారీ మొత్తంలో అమ్ముడుపోలేదని, ఈ విషయంలో ఆచార్య రికార్డు సృష్టించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సినీయర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మ్యూజిక్ అందించనున్నాడు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలలో నటించనుండగా.. సోనూసూద్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తున్నాడు.