బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌

సినీ పరిశ్రమను కరోనా వదలడం లేదు. ఇప్పటికే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడగా.. తాజాగా హీరో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. త్వరలో ఆచార్య షూటింగ్‌లో పాల్గొననున్న క్రమంలో నిబంధనల ప్రకారం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చిరంజీవి తెలిపారు.

CHIRU

ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నానని వెల్లడించారు. గత 5 రోజుల్లో తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చిరంజీవి సూచించారు. త్వరలోనే తాను కోలుకుని బయటికి వస్తానని చిరు చెప్పారు.

కాగా ఇటీవల సినీ ప్రముఖులతో కలిసి సీఎం కేసీఆర్‌ను చిరంజీవి కలిశారు. మరి చిరంజీవికి కరోనా సోకడంతో సీఎం కేసీఆర్ కూడా కరోనా టెస్టు చేయించుకుంటారని తెలుస్తోంది.