ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆచార్య సినిమా సెట్ చూశారా?

కొరటాల శివ డైరెక్టర్‌లో చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో 20 ఎకరాల్లో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేశారు. ఇండియాలోనే ఇదే భారీ సినిమా సెట్ కావడంతో.. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత భారీ సెట్ వేశారంటే.. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది.

acharya cinema set video

తాజాగా ఈ భారీ టెంపుల్ టౌన్ సెట్‌కి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవడం లేదు. ఈ వీడియో అమెజింగ్‌గా ఉంది. ఈ సందర్భంగా ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ ఇదేనని, 20 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని చిరు చెప్పాడు.

ఇది కళాదర్శకుల ప్రతిభకే ఓ మచ్చుతునక అని, తనకెంతో ముచ్చటనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకుంటున్నానని చిరు తెలిపాడు.