చిరంజీవి సర్జా ఫ్యామిలీకి కరోనా

సెలబ్రెటీలను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడగా.. తాజాగా మరో నటుడి ఫ్యామిలీ కరోనా బారిన పడింది. కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఆయన భార్య మేఘనా సర్జాతో పాటు రెండు నెలల కుమారుడు జూనియర్ చిరంజీవి సర్జాకు కకూడా కరోనా సోకింది. అంతేకాకుండా మేఘనా రాజ్ తల్లిదండ్రులు కూడా కరనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘనా సర్జా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

CHIRANJEVI SARJA

ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. గత కొద్దిరోజులుగా తమను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకుని హోం క్వారంటైన్ నిబంధన పాటించాలని ఆమె కోరారు. ప్రస్తుతం తాము చికిత్స పొందుతున్నామని, వైరస్‌ను జయించి త్వరలోనే కోలుకుని తిరిగి వస్తామన్నారు.

జూనియర్ చిరంజీవి ఆరోగ్యం బాగుందని, తానెల్లప్పుడూ తనతోనే ఉంటున్నానని, దయచేసి అభిమానులు ఆందోళన చెందవద్దని మేఘనా చెప్పారు. కాగా సౌత్ ఇండియా సినీయర్ హీరో అల్లున్ మేనల్లుడే కన్నడ నటుడు చిరంజీవి సర్జా. జూన్7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మరనించారు.