రెమ్యూనరేషన్ పెంచేసిన చిరు.. ఏకంగా రూ.60 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తైన తర్వాత ‘లూసీఫర్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నాడు. లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో నిర్మాతలు తీవ్ర నష్టపోయారు. ఇలాంటి తరుణంలో నిర్మాతలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అయితే అందుకు భిన్నంగా రెమ్యూనరేషన్‌ను చిరు ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

ఆర్థిక పరిస్థితుల క్రమంలో నటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్‌ను తగ్గిస్తూ ఇటీవల యాక్టివ్ తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ నిర్ణయం తీసుకుంది. అయితే దానిని కాదని ఏకంగా ఎక్కువ రెమ్యూనరేషన్‌ను చిరు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఖైదీ నెంబర్ 150 సినిమాకి గాను చిరు రూ.40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆచార్య సినిమాకి రూ.50 కోట్లు తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’ రీమేక్‌లో చిరు నటించనుండగా.. మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. దీనికి గాను చిరు రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడట.