మరో సినిమాను అనౌన్స్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి-సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో ప్రస్తుతం ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత మోహన్ రాజా డైరెక్షన్‌లో ఒక రీమేక్, మోహర్ రమేష్ డైరెక్షన్‌లో మరో రీమేక్ సినిమా చిరంజీవి చేయనున్నాడు. అయితే ఇప్పుడు మరో డైరెక్టర్‌కు చిరు అవకాశమిచ్చాడు. డైరెక్టర్ బాబితో చిరు ఒక సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. చిరు-బాబి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

CHIRU MOVIE WITH BABY

అయితే ఇది స్ట్రెయిట్ సినిమా అని తెలుస్తోంది. తాజాగా జరిగిన ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చిరంజీవి ఈ విషయాన్ని రివీల్ చేశాడు. కాగా గతంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో మైత్రీ మూవీ మేకర్స్ రంగస్థలం అనే సినిమా తెరకెక్కించింది. ఇక ప్రస్తుతం బన్నీతో పుష్ప సినిమా నిర్మిస్తుండగా.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ఉప్పెన సినిమాను నిర్మించింది.