మెగా అభిమానులకు బిగ్ డే

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ ఇవాళ విడుదల కానుంది. ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుంది. దీంతో ఈ టీజర్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ధర్మస్థలి తలుపులు తెరుచుకోనున్నాయని సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో జోరు మీద ఉన్న కొరటాల శివ ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

acharya teaser today

ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ కనిపించనుంది. అయితే ఇందులో రాంచరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా.. చెర్రీ పక్కన హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. చెర్రీ సరసన హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలో సినిమా యూనిట్ ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకులాట మొదలుపెట్టారు.