‘ఆచార్య’ టీజర్ టాక్: దుమ్ము దులిపేశాడు

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమా టీజర్ వచ్చేసింది. సినిమా యూనిట్ ముందుగా ప్రకటించిన సమయం ప్రకారం… కొద్దిసేపటి క్రితం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో మెగాస్టార్ దుమ్ము దులిపేశాడు. ఇందులో చిరు లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ టీజర్‌కి రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. రాంచరణ్ వాయిస్ హైలెట్‌గా నిలిచింది. ఫైట్ సీన్లు, టీజర్ చివరిలో చిరు డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీజర్ దుమ్ములేపడంతో.. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ACHARYA TEASER OUT

ఇందులో చిరంజీవి పక్కన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రాంచరణ్ కూడా కీలక పాత్రలలో నటించనున్నాడు. రాంచరణ్ పక్కన పూజాహెగ్దే హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంిద. ఈ సినిమా కోసం ఇండియాలోనే ఏ సినిమాకు వేయని అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ వేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మ్మెంట్స్ బ్యానర్లపై రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమ్మర్‌కి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.