‘ఆచార్య’ సెట్ ఆల్ టైం ఇండియన్ రికార్డు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో దీని షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ భారీ సెట్ ఏర్పాటు చేశారు. అంత భారీ సెట్ ఇప్పటివరకు ఏ సినిమాకు వేయలేదని, ఇండియాలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు సెట్ అని తెలుస్తోంది. దాదాపు 20 ఎకరాల్లో భారీ సెట్ వేసినట్లు సమాచారం.

aacharya set record
aacharya set record

ఈ సెట్‌లో సినిమాలోని కీలక సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇది టెంపుల్ టౌన్ సెట్ అని తెలుస్తోంది. 20 ఎకరాల్లో టెంపుల్ టౌన్ సెట్ వేయడం ఇండియాలోనే ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీంతో ఈ సెట్‌తో విడుదలకు ముందే ఆచార్య సినిమా ఒక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జనవరి 10తో చిరంజీవితో చేస్తున్న సోలో సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కానుండగా.. .ఆ తర్వాత కాజల్, రాంచరణ్‌లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ప్రస్తుతం రాంచరణ్ కరోనా బారిన పడటంతో.. కోలుకున్న తర్వాత ఆచార్య సెట్‌లో సందడి చేయనున్నాడు. దాదాపు 30 రోజుల పాటు రాంచరణ్ ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రాంచరణ్, చిరంజీవిలపై ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారని తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సమ్మర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.