పేరు గుర్తు పెట్టుకోండి… మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం సైరా, ఈ మూవీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ గా భారీ ధరకి అమ్ముడైంది, ఇప్పుడు సైరా డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అది కూడా రూ.40 కోట్ల భారీ ధరకే కావడం విశేషం. సౌత్ ఇండియాలో ఇంత మొత్తానికి డిజిటల్ రేట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారి. చిరుకి ఉన్న ఫాలోయింగ్, కథలో ఉన్న దమ్ము, తెరకెక్కించిన స్కేల్ అన్నీ కలిసి సైరా స్థాయిని పెంచాయి.

ఇక సైరా మూవీలో 10 యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే రీతిలో తీశారు. వాటిలో క్లయిమాక్స్‌కు ముందు వచ్చే యుద్ధం సీన్ ఓ వండర్ అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. ఇక ఇంటర్వెల్ ముందు సీన్ అండర్ వాటర్‌లో ముంబై స్విమ్మింగ్ పూల్‌లో తీశారు. ఇది గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని సమాచారం. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ మూవీ హిందీ డబ్బింగ్ ఇప్పటికే పూర్తయింది. మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకొంటోంది.