
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మ గారు ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అంజనమ్మ గారికి అస్వస్థత అంటూ మీడియాలో వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి గారు ఖండించారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
‘మా అమ్మ గారి ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్లో చేర్పించామని మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురయ్యారు. కానీ ఆమె ప్రస్తుతం క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మా అమ్మ గారి ఆరోగ్యం గురించి ఎలాంటి రూమర్లను మీడియా ప్రచురించొద్దని మనవి చేసుకుంటున్నాను’ అని అన్నారు.
https://x.com/KChiruTweets/status/1892921594688745968