Acharya: మెగాస్టార్‌తో చెర్రీ ఆచార్య షూటింగ్ లుక్స్ వైర‌ల్‌..

Acharya: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ సిద్ధ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే మెగాస్టార్‌తో రాంచ‌ర‌ణ్ న‌టించే సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు చిత్ర‌బృందం.

Acharya Movie Looks

ఈ నేప‌థ్యంలోనే Acharyaచిరంజీవి- రాంచ‌ర‌ణ్ కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంట్లో వీరిద్ద‌రు సేమ్ డ్రెస్‌లో క‌నిపించారు.. వైట్ ష‌ర్ట్‌.. బ్లాక్ ప్యాంటు లో ఉన్నా ఇద్ద‌రు షూటింగ్ జ‌రుగుతున్న క్ర‌మంలో ఒక‌రు ఫోటోను క్లిక్ మ‌నిపించారు. దాంతో ఆ ఫోటో కాస్త వైర‌ల్ గా మారింది. ఇప్పుడు ఈ Acharyaచిత్ర షూటింగ్ మారేడు మిల్లి ఏజెన్సీ ఏరియాల్లో జ‌రుగుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే విల‌న్ పాత్ర‌లో రియ‌ల్ హీరో సోనూసూద్ పోషిస్తుండ‌గా.. బ్యూటీ పూజాహెగ్దే కూడా ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ను చేస్తోంది. ఈ Acharyaచిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందిస్తున్నారు.