శ్రీకాంత్ కు చిరంజీవి పరామర్శ

గత రాత్రి ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ తండ్రి గారైన పరమేశ్వరరావు మరణించిన సంగతి తెలిసిందే. కాగా పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి శ్రీకాంత్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.