చిరంజీవి లూసిఫెర్ రీమేక్‌ ప్రముఖ దర్శకుడు చేతిలోకి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కోరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ తరువాత, చిరు లూసిఫెర్ రీమేక్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 2019 బ్లాక్ బస్టర్ చిత్రం ‘లూసిఫెర్’ యొక్క అధికారిక రీమేక్.

ఈ క్రేజీ రీమేక్‌ను చేయబోయే దర్శకుడి గురించి ఇటీవల వరకు అనేక వూహాగానాలు వచ్చాయి. ఇప్పుడు, తాజా సంచలనం ఏమిటంటే ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ లూసిఫెర్ రీమేక్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. వినాయక్ ఇంతకు ముందు మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సోషల్ డ్రామా, ఠాగూర్ మరియు ఖైదీ నెంబర్ 150 లకు దర్శకత్వం వహించారు, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి లూసిఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొణిదెల ప్రొడక్షన్స్ నుండి అతికొద్ది రోజులలో బయటకు రావొచ్చు. రామ్ చరణ్ ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేయనున్నారు.