పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి

కన్నడ సినీ పరిశ్రమ ఒక స్టార్ హీరోను కోల్పోయింది. శుక్రవారం నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ గుండె పోటు కారణంగా మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ మృతి చెందిన విషయం మీద మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. పునీత్ మరణం రాజ్ కుమార్ గారి కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి.