హద్దులు దాటుతున్న మిడిల్ క్లాస్ అమ్మాయి…

రుహాణి శర్మ… ‘చి ల సౌ’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహాణి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అందరినీ బాగా మెప్పించింది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ కి మంచి హీరోయిన్ దొరికింది అనే కాంప్లిమెంట్స్ అందుకున్న రుహాణి శర్మకి, తెలుగులో వరసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు కానీ చి లా సౌ సినిమా విడుదలై ఎనిమిది నెలలవుతున్నా కూడా ఆమె నుంచి రెండో సినిమా రాలేదు. కనీసం రుహాణి సైన్ చేసిన మూవీ కూడా లేదు, మరి అమ్మడి దగ్గరకి దర్శకులు వెళ్లట్లేదో, లేక రుహాణినే వద్దంటుందో తెలియదు కానీ ఈమె మాత్రం తన తదుపరి సినిమా గురించి ఏం మాట్లాడట్లేదు. తెలుగులో ఛాన్స్ వచ్చే లోపు తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రుహాణి, అక్కడ మాత్రం నిలదొక్కుకునే పరిస్థితి కనిపించట్లేదు.

రుహాణి శర్మ ఆలోచనంతా బాలీవుడ్ చుట్టే తిరుగుతుందని, అక్కడ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూడడంలో తప్పులేదు కానీ, అక్కడ ఛాన్స్ కోసం ఇక్కడి అవకాశాలని వదులుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది స్టార్స్ హీరోయిన్స్ బెస్ట్ యాక్టర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు, కొత్తగా వెళ్లిన అమ్మాయి అవకాశం రాబట్టి అక్కడ నిలబడడం అంటే మాటలు కాదు. ఈ విషయాన్నీ రుహాణి శర్మ కొంచెం లేట్ గా అర్ధం చేసుకున్నట్లు ఉంది, అందుకే ఛాన్సుల కోసం గ్లామర్ డోర్లు తెరిచింది. ‘చి ల సౌ’ సినిమాలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించిన రుహాణి తన ఇంస్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో హాట్ ఫోజులతో ఫోటోలు పెడుతూ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తుంది. అవకాశాల కోసమో, లేక మరేదైనా కారణమో తెలియదు కానీ రుహాణి పెడుతున్న హాట్ ఫోటోలు మాత్రం యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా ఫైట్లు చేస్తున్న వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్న రుహాణి, తాను యాక్షన్ సీన్స్ కూడా చేయగలను అంటోంది. మరి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి హద్దులు దాటిన అందాల ప్రదర్శనో లేక అమ్మడి యాక్షన్ ప్రయోగాలైనా అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి.