యాక్షన్ రోమాన్స్ కామెడీ ఎంటర్టైనర్ చెప్పాలని ఉంది మూవీ రివ్యూ

యాక్షన్ రోమాన్స్ కామెడీ ఎంటర్టైనర్ చెప్పాలని ఉంది మూవీ రివ్యూ

సినిమా : చెప్పాలని ఉంది’.

సమర్పణ : ఆర్.బి చౌదరి
బ్యానర్ : సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత:  వాకాడ  అంజన్ కుమార్, యోగేష్ కుమార్
రచన,  దర్శకత్వం:  అరుణ్ భారతి ఎల్
డైలాగ్స్ : విజయ్ చిట్నీడి
డివోపీ:  ఆర్ పి డిఎఫ్టీ
ఎడిటర్ : నందమూరి హరిబాబు, నందమూరి తారక రామారావు
సంగీతం : అస్లాం కీ
ఆర్ట్ డైరెక్టర్ :  కోటి, వి రామకృష్ణ
కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్, అజయ్ శివశంకర్, రామ్ శివ
పీఆర్వో : వంశీ శేఖర్

తారాగణం: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య , పృధ్వి , మురళీ శర్మ , సునీల్ , తనికెళ్ల భరణి , రాజీవ్ కనకల, రఘుబాబు , అలీ , సత్యం రాజేష్, నంద కిషోర్ , అనంత్ తదితరులు.

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రలలో అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

చంద్ర శేఖర్ (యష్ పూరి ) అప్పుల్లో ఉన్న తన సొంత ఇంటిని విడిపించుకోవడానికి ర్యాపిడో డ్రైవర్ గా, మరో వైపు G 7 న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేస్తుంటాడు. ర్యాపిడో డ్రైవ్ చేస్తున్న టైమ్ లో వెన్నెల(స్టెఫీ పటేల్) తో పరిచయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ దగ్గర అడుక్కునే పిల్లలకు డబ్బులు ఇవ్వకుండా ఫుడ్ పెట్టమని చెపుతున్న చందు మాటలకు ఇన్స్పెర్ అయిన వెన్నెల చందును ప్రేమిస్తుంది. చందు G7 ఛానల్ లో యాక్టీవ్ గా ఉంటూ తన సుపీరియర్ పృద్వీ దగ్గర మంచి పేరు సంపాదిస్తాడు.ఛానల్ మీటింగ్ లో టి. ఆర్. పి రేటింగ్స్ కొరకు ప్రజలకు ఉపయోగం లేని న్యూస్ కవర్ చేసే దానికంటే ఎంతో మందికి హెల్ప్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ సత్య మూర్తి(మురళీ శర్మ ) లాంటి మంచి వారిని ఇంటర్వ్యూ చేస్తే మన టివి కి మంచి పేరు వస్తుందని చెప్పడంతో తన బాస్ ఏకీభవిస్తూ ఆ ఇంటర్వ్యూ బాధ్యత చందుకు అప్పగిస్తారు. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని సత్య మూర్తి అడ్రస్ తెలుసుకుని సత్య మూర్తిని ఇంప్రెస్స్ చేసి చివరకు ఇంటర్వ్యూ కి ఒప్పిస్తాడు..అయితే ఇంటర్వ్యూ చేసే రోజు జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్ లో చందు తలకు గాయం అవుతుంది. అయితే ఎంతో కష్టపడి సత్య మూర్తి ని ఇంటర్వ్యూ చేసే టైమ్ లో చందు అందరినీ గుర్తుపడుతున్నా తను మాట్లాడే బాషను మరిచిపోయి సడన్ గా వేరే భాష మాట్లాడతాడు.చందు మాట్లాడే బాష ఎవరికీ అర్ధంకాక తెలియని భాష ఎందుకు మాట్లాడు తున్నాడో తెలియక ఇంటర్వ్యూ కు వచ్చిన సత్య మూర్తి తిరిగి వెళ్ళిపోతాడు. తరువాత డాక్టర్ రాజీవ్ కనకాల చెకప్ చేసి తను ఏ బాష మాట్లాడు తున్నడో అర్థం కాక ప్రపంచంలో ఉండే అన్ని బాషాలతో మ్యాచ్ చేయాలని చూసినా ఏ బాష మ్యాచ్ కాదు.తను ఇలాగే ఉంటే తనిప్పుడు మాట్లాడే భాషతో పాటు విని అర్థం చేసుకొనే శక్తి కూడా తగ్గిపోతుంది. దీన్నే మెడికల్ భాషలో ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ డిసీజ్ అని చెపుతాడు.ఆలా తెలియని భాష కారణంగా చందుకు చాలా సమస్యలు వస్తాయి.తన దగ్గర వున్న వాళ్ళు దూరమౌతారు.తనను ఎవరూ అర్ధం చేసుకోరు. తనకు ఎదో చెప్పాలని వుంటుంది. కానీ చెప్పలేకపొతుంటాడు.అయితే చందును రికవర్ చేయడానికి వెన్నెల ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ వృధా అవుతుంటాయి.చివరకు తనను మాములు మనిషిని చెయ్యడానికి వెన్నెల ఏం చేసింది? తను చేసే ప్రయత్నంలో చందు మారాడా లేదా? సత్య మూర్తిని ఇంటర్వ్యూ చెయ్యాలనే చందు డ్రీమ్ నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే “చెప్పాలని ఉంది’ సినిమా కచ్చితంగా చూడాల్సిందే..

నటీ నటుల పని తీరు

చంద్ర శేఖర్ గా నటించిన యష్ పూరి కొత్తవాడైనా చక్కటి ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ లతో చక్కటి నటనను కనబరచాడు.యాక్షన్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేశాడు ఎన్నో సినిమాలు చేసిన నటుడులా తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయాడు. వెన్నెల పాత్రలో నటించిన (స్టెఫీ పటేల్) సాధారణమైన మద్య తరగతి యువతిగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. చందుని ప్రేమించిన తరువాత తనపై చూపించే ప్రేమ, భావోద్వేగాల సన్నివేశాలలో చక్కగా నటించి యూత్ ను ఆకట్టుకుంది. చందు మరియు వెన్నెల మధ్య ప్రేమ సన్నివేషాలు బ్యూటీఫుల్ గా వున్నాయి. చందు ఫ్రెండ్ గా సత్య చందు సుపీరియర్ గా పృథ్వి లు ఇద్దరూ తమ మాటలతో ప్రేక్షకులను అలరించారు. బిజినెస్ మ్యాన్ గా మురళీ శర్మ, చాలా న్యాచురల్ గ నటించాడు. డాక్టర్ గా రాజీవ్ కనకాల బాగా చేశాడు , హీరోయిన్ వెన్నెల తండ్రిగా నటించిన తనికెళ్ల భరణి భావోద్వేగమైన డైలాగ్స్ తో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.విలన్ పాత్రలో రఘుబాబు , అలీ,  సత్యం రాజేష్, నంద కిషోర్ , అనంత్  తదితరులు అంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
‘పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం’ అని అంతర్లీనంగా మంచి సందేశం ఇస్తూ బలమైన మీనింగ్ వున్న కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని దీనికి కామెడీ, డ్రామా, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ జోడిస్తూ అన్ని వర్గాల వారికీ నచ్చేలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ లా దర్శకుడు అరుణ్ భారతి ఎల్.   అద్భుతంగా తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు అస్లాం కీ చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల వెన్నెల అనే రొమాంటిక్ సాంగ్ , సునీల్ తో పాడిన మోటివేషన్ సాంగ్ , చివరగా ఎమోషనల్ సాంగ్స్ ఇలా అన్నీ పాటలు బాగున్నాయి.సినిమాటోగ్రాఫర్ ఆర్ పి డిఎఫ్టీ తన కెమెరాతో చక్కటి విజువల్స్ అందించాడు. బాహుబలికి రాసిన తర్వాత ఏ సినిమాకు రాయని మాటల రచయిత విజయ్ చిట్నీడి చెప్పాలని ఉంది’ సినిమాకు రాయడం విశేషం. నందమూరి  హరిబాబు,  నందమూరి  తారక  రామారావు ల ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఆర్.బి చౌదరి సమర్పణలో ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన 94 వ చిత్రాన్ని నిర్మాతలు వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ లు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కామెడీ, డ్రామా, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ జోడిస్తూ అన్నీ ఎలిమెంట్స్ ఉండేలా చాలా ఫ్రెష్ కంటెంట్ తో తెరకెక్కిన ‘చెప్పాలని ఉంది’ సినిమాను గుర్తు పెట్టుకునేలా ఒక వినూత్నమైన ప్రయోగం చేయడంలో దర్శక, నిర్మాతలు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. మన బాషను ప్రేమిద్దామనే మంచి మెసేజ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వ‌య‌స్సుల‌ వారిని కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు