Liger: రౌడీని యాక్టివ్‌పై ఎక్కించుకుని ఛార్మి షికార్లు..

Liger: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ తొలి సారి పాన్ ఇండియా స్థాయిలో లైగ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన‌పాత్రను పోషిస్తుండ‌గా.. బాలీవుడ్ భామ అనన్య‌పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ న‌టి ఛార్మీ స‌హ నిర్మాత‌. అయితే ప్ర‌స్తుతం లైగ‌ర్ షూటింగ్ బాంబేలో జ‌రుగుతుండ‌గా.. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌పై ప‌లు స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు.

Vijay-charmy

కాగా Ligerషూటింగ్ గ్యాప్‌లో ఛార్మీ యాక్టివాపై హీరో విజ‌య్‌ను ఎక్కించుకుని ముంబ‌యి రోడ్ల‌పై షికారు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను చార్మీ ట్విట్ట‌ర్లో షేర్ చేసింది.. అలాగే మీరు చూస్తున్నారు క‌దా.. విజ‌య్ నాపై గ‌ట్టి న‌మ్మ‌కంతోనే బండెక్కాడు.. షూటింగ్ గ్యాప్‌లో ముంబై రోడ్ల‌పై ఇలా షికార్లు చేశామంటూ చార్మీ పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహ‌ర్ నిర్మిస్తుండ‌గా.. సెప్టెంబ‌ర్ 9న ఈLiger చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించారు.