Acharya Movie: ఆచార్య‌లో చ‌ర‌ణ్-ఉపాస‌న సంద‌డి..

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య చిత్రంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సిద్ధ పాత్ర‌ను పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పుగోదావ‌రి జిల్లాలోని దేవీప‌ట్నం మండ‌లం ఎ.వీర‌వరంలో జ‌రుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి సాంగ్‌ను కొత్త అంగుళూరు వ‌ద్ద గోదావ‌రి ఒడ్డున చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్ జ‌రుగుతున్న ప్రాంతానికి మెగాభిమానులు భారీగా చేరుకున్నారు. అక్క‌డే ఉన్న రామ్‌చ‌ర‌ణ్ వారితో క‌లిసి ఫోటోలు దిగారు. ఇక ఈAcharya Movie చిత్ర షూటింగ్ వ‌చ్చిన మ‌రో అతిథి చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న. ఆమె ఈ Acharya Movieచిత్ర షూటింగ్ చూడ్డానికి వ‌చ్చింది..

ramcharan

ఈ క్ర‌మంలోనే ఆమె దేవీ ప‌ట్నంలోని తొయ్యేరు జ‌డ్పీ ఉన్న‌త పాఠ‌శాలను సంద‌ర్శించింది.. కాసేపు స‌ర‌దాగా విద్యార్థుల‌తో మాట్లాడి.. వారితో సెల్ఫీలు దిగింది ఉపాస‌న‌. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే విల‌న్ పాత్ర‌ల్లో రియ‌ల్ హీరో సోన్‌సూద్ పోషిస్తుండ‌గా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల్ సంయుక్తంగా ఈ Acharya Movie చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.. దీంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాపై ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్యAcharya Movie చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.