కాజల్ అగర్వాల్ కళ్యాణ వేదికలో మార్పులు.. హనీమూన్ ఎప్పుడంటే..

సౌత్ ఇండియన్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న ముంబైలోని ఒక హోటల్ లో వీరి వివాహం జరగనున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఆ వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో మరొక ఇంట్రెస్టింగ్ రూమర్ కూడా వైరల్ గా మారింది.

నిజానికి కాజల్ హోటల్ లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్ ఇంటివద్దనే వివాహ వేడుకకు నిర్వహించనున్నారట. ముంబైలోని కాజల్ నివాసంలో దగ్గర సింపుల్ గా నిర్వహించే వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఈ జంట విదేశాలలో తమ హనీమూన్ కోసం కూడా ప్రణాళిక వేసుకున్నారట. కుదిరితే నవంబర్ మొదటి వారంలోనే హనీమూన్ కి వెళ్లనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.