చాణక్య ట్రైలర్ రివ్యూ

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన కంప్లీట్ స్పై థ్రిల్లర్ చాణక్య ట్రైలర్ రిలీజ్ అయ్యింది. గతంలో వచ్చిన టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ ని కలిగిస్తే, ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. మాములు సమాజంలో బ్యాంక్ ఎంప్లొయ్ రామకృష్ణగా లైఫ్ లీడ్ చేస్తున్న అర్జున్ శ్రీకర్ ఒక ఇండియన్ ఎక్స్టెర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘RAW’కి వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక మిషన్ పైన పాకిస్థాన్ వెళ్లిన అర్జున్ అక్కడి పరిస్థితులని ఎదురుకోని దేశం కోసం ఎలా ఫైట్ చేసి తనకి అప్పగించిన మిషన్ పూర్తి చేసుకోని వచ్చాడు అనేది సింపుల్ గా చాణక్య కథ. ఇలాంటి స్పై థ్రిల్లర్స్ కి కథ కన్నా కథనం ముఖ్యం కాబట్టి స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటే సినిమా చూస్తున్న ఆడియన్స్ అంత ఎంగేజ్ అవుతారు. ఈ రూల్ ఒక్కటి ఫాలో అయితే చాలు స్పై థ్రిల్లర్ హిట్ అవ్వడం ఖాయం.

ఇక చాణక్య విషయానికి వస్తే, ట్రైలర్ లో ముందుగా గోపీచంద్ ని రా ఏజెంట్ అర్జున్ శ్రీకర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తూ అర్జున్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. రా ఏజెంట్ అన్న తర్వాత తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ లో ఉంటూ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి అర్జున్ శ్రీకర్ కాస్త బ్యాంక్ ఎంప్లొయ్/ ఇన్సూరెన్స్ ఏజెంట్ రామకృష్ణగా మారాడు. ఇక్కడ తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చూపించారు. మెహ్రీన్, గోపీచంద్, సునీల్ సీన్స్ కొన్ని వచ్చాయి, వీటితో పాటు ఒక సాంగ్ మాంటేజ్ కూడా వచ్చింది, ఈ మాంటేజ్ అయ్యే సరికి గోపీచంద్ ఫైట్ లో సీన్ లో కనిపించాడు.

ఇక అప్పటి వరకూ అతన్ని ఒక మాములు బ్యాంకు ఉద్యోగి రామకృష్ణగా మాత్రమే చూసిన మెహ్రీన్, రామకృష్ణని అతని ఐడెంటిటీ గురించి అడుగుతుంది. ఇక్కడి వరకూ గోపీచంద్ క్యారెక్టర్ లోని రెండు షేడ్స్ ని చూపించేలా కట్ చేసిన ట్రైలర్ లో ఇప్పుడు విలన్ అబ్దుల్ సలీంగా బాలీవుడ్ నటుడు రాజేష్ ఖట్టర్(గగనం, కేడి ఫేమ్) ఎంట్రీ ఇచ్చాడు. ఇండియా వాళ్లు తనని మర్చిపోయినట్లు ఉన్నారు అనే డైలాగ్ చెప్పిన రాజేష్ ఖట్టర్, వాళ్లకి మళ్లీ తన ఉనికిని గుర్తు చేయడానికి ఎదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఏం ప్లాన్ చేశాడు అనేది ట్రైలర్ లో చూపించలేదు కానీ రాజేష్ ఖట్టర్ ఇంట్రడక్షన్ అయ్యాక, ఇండియన్ ఆఫీసర్స్ పాకిస్థాన్ లో ఉన్న మన రా ఏజెంట్స్ కి చెప్పి అర్జున్ ని చంపేయమని ఆర్డర్స్ వేశారు. మన రా ఏజెంట్ ని మన వాళ్లే ఎందుకు చంపడం అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ గా కట్ చేశారు. ఈ సమయంలో పాకిస్థాన్ లోనే ఉన్న అర్జున్ శ్రీకర్, అదే గోపీచంద్ బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ని మీట్ అయ్యాడు.

ఇక్కడ జరీన్ ఖాన్ ఇది పాకిస్థాన్ సోహెల్ పట్టుకోవడం అంత ఈజీ కాదు అని చెప్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ లో రెండు చోట్ల, ఆ తర్వాత అక్కడ కనిపించిన ఉపేన్ పటేలే ఏ సోహెలా అనేది తెలియాల్సి ఉంది. జరీన్ ఖాన్ సీన్ అయిపోయాక గోపీచంద్, రాజేష్ ఖట్టర్ కన్ఫరెంటేషన్ సీన్ చూపించారు. ఇక్కడ గోపీచంద్, రాజేష్ ని ఖురేషి అనే పేరుతో పిలిచాడు. రాజేష్ ఖట్టర్ ఖురేషి అయితే మరి ట్రైలర్ స్టార్టింగ్ లో చెప్పిన అబ్దుల్ సలీం ఎవరు? ఒకవేళ అబ్దుల్ సలీం ఉపేన్ పటేల్ అయితే మరో సోహెల్ ఎవరు? సోహెల్, అబ్దుల్ సలీం ఈ రెండు పాత్రల్లో ఒకటి ఉపేన్ పటేల్ నటిస్తే మిగిలి ఉన్న ఆ రెండో పాత్ర చేసిన ఎవరు? సస్పెన్స్ కోసమే అతన్ని దాచారా? అసలు మన రా ఏజెంట్ అర్జున్ శ్రీకర్ ని మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకు చంపాలి అనుకున్నారు? అనే పాయింట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ట్రైలర్ ని డిటైల్డ్ గా అబ్సర్వ్ చేస్తే ఒక స్పై థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. మరి వీటిని ఎంత ఎంగేజింగా మలిచి సినిమాని నడిపించారు అనే దాన్ని బట్టే చాణక్య రిజల్ట్ ఉంటుంది. ఇప్పటికైతే ఈ ట్రైలర్ చాణక్య సినిమాపై అంచనాలని పెంచింది. టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా చాణక్య టాప్ నాచ్ లో ఉంది. మరి ప్రేక్షకులని ఎంత వరకూ మెప్పిస్తుందో తెలియాలి అంటే అక్టోబర్ 5 వరకూ ఆగాలి.