Alluarjun: “చావు క‌బురు చ‌ల్ల‌గా” ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్టైలిష్‌స్టార్ చీఫ్‌గెస్ట్‌!

Alluarjun: ఆర్ఎక్స్‌100 చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ న‌టించిన‌ తాజా చిత్రం చావుక‌బురు చ‌ల్ల‌గా. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టైటిల్ సాంగ్‌, అన‌సూయ ఐటెం సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను కౌశిక్ పెగుళ్ల‌పాటి ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా.. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ సంద‌ర్భంగా మార్చి 9న‌ ప్రీ రిలీజ్ వేడుకల‌ను నిర్వ‌హించ‌నున్నారు చిత్ర‌బృందం. ఈ కార్య‌క్ర‌మాన‌కి ముఖ్య అతిథిగా స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్Alluarjun రానున్నార‌ని చిత్ర‌బృందం పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.