ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్.. చిత్రకు పద్మభూషణ్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను పద్మ అవార్డులు తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా.. అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మంది పద్మభూషణ్ పురస్కారాలు ప్రకటించింది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ లభించగా.. గాయని కేఎస్ చిత్రకు పద్మభూషణ్ దక్కింది.

sp balasubramanyam padmavubhusan

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కళల విభాగంలో రామస్వామి అన్నవరపు నిడమోలు సుమతికి లభించగా.. సాహిత్య రంగం నుంచి ప్రకాశ రావు ఆసవడికి దక్కింది. ఇక తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకి దక్కింది.