రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్‌కౌంటర్‌పై ఆర్జీవీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా యూనిట్‌కి మరో షాక్ తగిలింది. దిశ సినిమాకు సెన్సార్ బ్రేక్ వేసింది. దిశ ఎన్‌కౌంటర్ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. సెన్సార్ ఇవ్వాలో లేదో నలుగురు సభ్యుల బోర్డ్ తేల్చుకో లేకపోయింది.

RGV CENSOR BOARD SHOCK

సెన్సార్ బృందం రిజెక్ట్ చేయడంతో రివిజన్ కమిటీ పరిశీలనకు మూవీని పంపించారు. రియల్ సీన్లకు దగ్గరగా దిశ ఎన్కౌంటర్ సినిమా తీయడంతో.. సెన్సార్ చిక్కులు ఎదురయ్యాయి. కాగా ఇప్పటికే దిశ సినిమాపై బాధితురాలు పేరెంట్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.