ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును శుక్రవారం వివాహమాడిన విషయం తెలిసిందే. కరోనా క్రమంలో అతి తక్కువమంది అతిథుల సమక్షంలో వీరిద్దరి వివాహం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో కాజల్ వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కాజల్-కిచ్లు జంటకు అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే పెళ్లి ముందు పెళ్లి కుమార్తెగా రెడీ అవుతున్న క్రమంలో ఓ ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాజల్ పంచుకుంది. పెళ్లి కుమార్తెగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసి‘తుపానుకు ముందు ఉండే నిశ్శబ్దం’ అనిక్యాప్షన్ ఇచ్చింది. దీంతో సమంత, కీర్తి, తమన్నా, లక్ష్మిమంచు, నీరజా కోనా, రకుల్ ప్రీత్ సింగ్, సోనూ సూద్, అమలాపాల్‌తోపాటు మరికొంతమంది సినీ తారలు కాజల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. న్యూ లైఫ్‌లో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు విషెస్ చెప్పారు.