పెళ్లి కాకముందే గర్భవతి అయిన సెలబ్రిటీలు వీళ్లే

బాలీవుడ్ టాప్ సింగర్ నేహా కక్కర్ పెళ్లైన రెండు నెలలకే గర్భవతి అయిందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లైన రెండు నెలలకే గర్భవతి ఎలా అయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 24న రోహన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తిని నేహా కక్కర్ లవ్ మ్యారేజ్ చేసుకుంది. అంతకుముందు రెండు సంవత్సరాల పాటు వీళ్లు డేటింగ్‌లో ఉన్నారు. అయితే కొంతమంది సెలబ్రెటీలు పెళ్లికి ముందే గర్భవతి అయ్యారు.

NEHA KAKKAR

బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్చిన్ తన బాయ్ ఫ్రెండ్ హర్షబర్గ్‌తో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై ఆమెను మీడియా ప్రశ్నించగా.. పెళ్లికి, పిల్లలను కొనడానికి సంబంధం ఏంటీ? అని ఎదురు ప్రశ్నించింది. ఇక నేహా దూపియా పెళ్లికి కొద్దిరోజుల ముందే తల్లి అయినట్లు ప్రకటించిన సంచలనం రేపింది. ఇక టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకొవివ్ కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. ఈ ఏడాది జులైలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నీనా గుప్తా కూడా పెళ్లికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తెలుగు సినిమాల్లో కూడా నటించిన సెలీనా జైట్లీ 2011లో సీక్రెట్‌గా పెళ్లిచేసుకుంది. తర్వాత తొమ్మిది నెలలు కాకముందే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక బాలీవుడ్ నటి కొంకణా సేన్ నటుడు రన్వీర్ షోరేను పెళ్లి చేసుకోకముందే గర్భవతి అయింది. ఇక కమల్ హాసన్ మాజీ భార్య సారిక కమల్‌ను పెళ్లిచేసుకోకముందే శృతిహాసన్‌కు జన్మనిచ్చింది.