మాస్టర్ సీన్స్ లీక్ చేసిన వ్యక్తిపై రూ.25 కోట్లు దావా

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సంపాదించుకుంటోంది. రిలీజ్‌కి ముందురోజు మాస్టర్ సినిమాలోని కొన్ని సీన్లు లీక్ కావడంతో.. సినిమా యూనిట్ ఆందోళనకు గురైంది. ఇక కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిన సినిమా నిర్మాతలు అయితే టెన్షన్‌కి గురయ్యారు.

master movie leak

ఈ క్రమంలో మాస్టర్ సినిమాలోని సీన్స్‌ను లీక్ చేసిన వ్యక్తిపై కేసు పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నారట. పరిహారంగా రూ.25 కోట్ల దావా వేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సదరు వ్యక్తికి లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. కాగా మాస్టర్ తొలి వీకెండ్‌లోనే తమిళనాడులో రూ.100 కోట్ల గ్యాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.