
ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలను చూసిన ప్రభుత్వం వీటిపై కన్య చేయడం జరిగింది. అయితే పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ తమ సంస్థల మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేసినందుకుగాను కేసులు నమోదు చేశారు.

ఇది ఇలా ఉండగా ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరి కొంతమంది సినిమా ప్రముఖులపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగాను కేసు నమోదుకోవడం జరిగింది. వారిలో ముఖ్యంగా నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగళ్ళ, నిధి అగర్వాల్, శ్యామల, శ్రీముఖి, విష్ణు ప్రియా ఇంకా మరో 15 మంది సెలబ్రెటీల పై కాసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఏ బెట్టింగ్ యాప్స్ పై వీరు ప్రమోషన్ చేశారు అనే విషయం స్పష్టంగా తెలియచేస్తూ సెక్షన్లను కూడా పేర్కొనడం జరిగింది.