బాహుబలి రికార్డులని కొట్టడానికి ఇదే మొదటి అడుగు…

బాహుబలి… బాహుబలి… బాహుబలి… వంద కోట్లు కూడా వసూళ్ళు కష్టమైన తెలుగు సినిమాతో ఇండియా మొత్తం కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా. బాహుబలి బాహుబలి అని అన్నీ ఇండస్ట్రీల సినీ అభిమానులు థియేటర్స్ లో జేజేలు కొట్టిన ఈ మూవీని రాజమౌళి ఒక మహాకావ్యంలా తీర్చిదిద్దాడు. దాదాపు అయిదేళ్ల పటు తెరకిక్కిన ఈ మూవీ మేకింగ్ వీడియో 88.4 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఒక మేకింగ్ వీడియో ఇన్ని వ్యూస్ రాబట్టింది అంటే బాహుబలి మూవీ కోసం ఫాన్స్ ఎంతగా వెయిట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన బాహుబలి తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ దెగ్గర హిట్ అయ్యాయి కానీ ఏ స్టార్ హీరో మూవీ కూడా బాహుబలి రికార్డులని టచ్ కూడా చేయలేక పోయాయి.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాహుబలి కోటకి బీటలు వారెలా చేయడానికి సిద్దమవుతున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ వీడియో జూలై 15న విడుదల కానుంది. ఆరోజే బాహుబలి రికార్డులు బ్రేక్ అవ్వడానికి పునాదులు పడనున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్, రాజమౌళి మ్యాజిక్, బాలీవుడ్ స్టార్స్ ఇమేజ్ అన్నీ కలిసి ఈ మేకింగ్ వీడియోని 88.4 మిలియన్ వ్యూస్ దాటిస్తే బాహుబలి రికార్డు బద్దలైపోయినట్లే. ఒక తెలుగు హీరో క్రియేట్ చేసిన రికార్డుని మళ్లీ తెలుగు హీరోలే బ్రేక్ చేశారు అని గర్వంగా చెప్పుకునే రోజు దెగ్గర లోనే ఉంది.