ఒకప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్స్ తో హీరోల మధ్య పోటీ ఉండేవి. అలాగే ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది అనే విషయంలో కుడా ఫైట్స్ నడిచేవి. కానీ ఇప్పుడు అభిమానుల డామినేషన్ తో హీరోల క్రేజ్ ఒక్కసారిగా మారిపోతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ రికార్డ్స్ ఒక రేంజ్ లో నమోదవుతున్నాయి. ఇక ఇటీవల #AdvanceHBDPawanKalyan ట్యాగ్ పై ఒక రోజులోనే 27.3 ట్వీట్స్ వెలువడిన విషయం తెలిసిందే.
మొన్నటివరకు ఇండియాలో అదే అతిపెద్ద ట్విట్టట్ ట్రెండ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు మహేష్ అభిమానులు ఆ రికార్డును బ్రేక్ చేశారు. #MaheshBabuBdayCDP ట్యాగ్‌పై 24 గంటల్లోనూ 3 కోట్ల 10 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ పవన్ బర్త్ డేకు ఈ రికార్డును బ్రేక్ చేయాలని పవర్ స్టార్ అభిమానులు టార్గెట్ గా పెట్టుకున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలోవర్స్(ప్రస్తుతం 4M) సంఖ్య కూడా పెంచాలని ముఖ్యంగా ఆ విషయంలో మహేష్ బాబు రికార్డును (ప్రస్తుతం 10.2) బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.