హ్యాట్రిక్ హిట్ ఇస్తాడా?

సోలో హీరోగా కెరీర్ కష్టాల్లో ఉంది అనుకుంటున్న టైములో గరుడ వేగ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చిన హీరో డాక్టర్ రాజశేఖర్. సరైన కథ పడితే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్ట గలిగే సత్తా తనలో ఇంకా ఉందని ప్రూవ్ చేసిన రాజశేఖర్, రీసెంట్ గా కల్కి సినిమాతో మళ్లీ హిట్ ఇచ్చాడు. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ రెండు సినిమాలు రాజశేఖర్ ని ఈ జెనరేషన్ ప్రేక్షకులకి మళ్లీ దగ్గర చేశాయి. యాంగ్రీ యంగ్ మాన్ నుంచి యాంగ్రీ యంగ్ స్టార్ గా మారిన రాజశేఖర్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే రెండు థ్రిల్లర్ కథలతో హిట్స్ ఇచ్చిన రాజశేఖర్, మరోసారి అదే బాటలో నడుస్తూ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ డైరెక్టర్, ప్రదీప్ కృష్ణమూర్తి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని రాజశేఖర్ చెప్పారు. క్రియేటివ్ ఎంటటైనెర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై డాక్టర్ జి. ధనంజయన్ ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ అండ్ చెన్నైలో జరిపి, వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.