అల్లుఅర్జున్ బుట్ట‌బొమ్మ సాంగ్ స‌రికొత్త రికార్డు..

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గ‌తేడాది త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల వైకుంఠ‌పురం సినిమా ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని అన్ని పాట‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ సినిమాలోని పాట‌ల్లో మ‌రీ ముఖ్యంగా బుట్ట బుమ్మ సాంగ్ మాత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. రామ‌జోగ‌య్యశాస్త్రి రాసిన బుట్ట‌బొమ్మ సాంగ్ ఏకంగా 500 మిలియ‌న్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో సెన్సెష‌న‌ల్ హిట్‌గా నిలిచింది ఈ సాంగ్‌. తెలుగులో ఈ రికార్డ్ అందుకున్న తొలి తెలుగు పాట‌గా రికార్డు క్రియేట్ చేసింది.

buttabomma record views

అలాగే ఈ పాట‌కు జానీ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట‌ను సింగ‌ర్ అర్మాన్ మాలిక్ పాడాడు. మొత్తానికి అలావైకుంఠ‌పురం సినిమా స‌క్సెస్‌తో పాటు త‌మ‌న్‌, అల్లుఅర్జున్‌, పూజాహెగ్దే, త్రివిక్ర‌మ్ స‌హా అంద‌రి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు ప‌లు భాష‌ల్లో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. అయితే అల వైకుంఠ‌పురంలో మ్యూజిక్ ఆల్బ‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మొద‌ట‌గా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‌ రావ‌డానికి కార‌ణం త‌మ‌న్ అందించిన సంగీతం.. దీంతో అల్లుఅర్జున్ న‌ట‌న‌తో ఈ సినిమా ఓ రేంజ్‌లో బ్లాక్‌బ‌స్టర్ హిట్‌గా నిలిచింది.