బన్నీ కూతురు క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసింది.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటోంది. నేటితో ఈ పిల్ల నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అర్హపై క్రియేట్ చేసిన ‘అంజలి అంజలి’ కవర్ సాంగ్‌ను సోషల్ మీడియాలో బన్నీ విడుదల చేశాడు.

మణిరత్నం, ఇళయరాజా కాంబినేషన్‌లో వచ్చిన అంజలి సినిమాలోని ‘అంజలి అంజలి’ పాట పెద్ద పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో చాలామంది ఫోన్లలో ఈ పాటను రింగ్‌టోన్‌గా వినిపిస్తూ ఉండేది. ఈ పాటలో బేబీ షామిలి నటన అయితే ఇక అద్భుతమని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ హిట్ సాంగ్‌లో షామిలిని అల్లు అర్హ రిప్లేస్ చేసింది. ఈ పాటలో తన క్యూట్ క్యూట్ లవ్లీ ఎక్స్‌ప్రెసన్స్‌తో అర్హ ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది

అయితే తన ముద్దుల పాప అర్హ బర్త్ డే సందర్భంగా తన కూతురికి బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే తన గారాల పట్టితో కుటుంసభ్యుల సమక్షంలోనే బన్నీ కేక్ కట్ చేయించాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌ అర్హ. నీ క్యూట్‌నెస్‌, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్‌ ఏంజెల్‌’అంటూ ఆ ఫొటోలను బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.