‘పొట్టేల్’ సినిమా నుండి “బుజ్జి మేక” లిరికల్ వీడియో

యువచంద్ర, అనన్య నాగళ్ళ జంటగా నటిస్తూ సాహిత్ మొత్ఖురి దర్శకత్వంలో వస్తున్న సినిమా పొట్టేల్. నిషాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే జంటగా నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్, నిశ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై రానుంది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. మోనిష భూపతిరాజు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్ర పాటలు టి సిరీస్ సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రం నుండి బుజ్జి మేక అనే పాత లిరికల్ వీడియో విడుదల కావడం జరిగింది. ఈ పాటకు శ్యామ్ లిరిక్స్ అందచేయగా కాల భైరవ తన స్వరాన్ని జోడించి పాడారు. ఈ సినిమాలో నోయెల్, అజయ్, ప్రియాంక శర్మ, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ ఐఎంగర్, తనస్వి చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.