Uppena: ఉప్పెన చిత్రంలో విజ‌య్‌సేతుప‌తి వాయిస్ న‌చ్చ‌లేదు.. స్పందించిన డైరెక్ట‌ర్‌!

Uppena: మెగా మేన‌ల్లుడు సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యమ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంతో బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అలాగే వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతుంది. ఇక ఈ చిత్రంలో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేత‌ప‌తి విల‌న్ పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇక ఇటీవ‌లే ఉప్పెన‌ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

uppena vijay

Uppena ఇందులో విజ‌య్‌సేతుప‌తి పాత్ర డ‌బ్బింగ్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.. విజ‌య్ సేతుప‌తి వాయిస్ న‌చ్చ‌లేదు.. అయినా ఓన్ వాయిసే బాగుంటుంద‌ని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విష‌యంపై ఈ చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స్పందించ‌గా.. Uppena ఈ సినిమాలో విజ‌య్‌సేతుప‌తి త‌న వాయిస్ స‌రిపోవ‌ట్లేదు.. అందుకే అరుంధ‌తి సినిమాలో సోనూసూద్‌కు డ‌బ్బింగ్ చెప్పిన బొమ్మాళి శంక‌ర్‌ను విజ‌య్‌సేతుప‌తి పాత్ర కోసం డ‌బ్బింగ్ చెప్పించాం. బొమ్మాళి శంక‌ర్ ఎక్కువ పారితోషికం తీసుకునే డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ల్లో ఒక‌రు.. ఒక్క‌రోజుల్లోనే డ‌బ్బింగ్ పూర్తి చేస్తారు. అయినా ఈ సినిమాలో విజ‌య్‌సేతుప‌తి డ‌బ్బింగ్ అద్భుతంగా వ‌చ్చింద‌ని.. అతడి గొంతుUppena తెర‌పై అంద‌రినీ భ‌య‌పెడుతుంద‌ని డైరెక్ట‌ర్‌ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.