తమిళ నటుడు విజయ్ దలపతికు చుక్కెదురు

తమిళ హీరో దళపతి విజయ్ పార్టీ టీవీకే పార్టీ జెండాపై ఏనుగు గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని, పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా, రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన బహుజన సమాజ్ పార్టీ. బీఎస్పీ పార్టీ జెండాలో ఏనుగు ఉన్న విషయం అందరికి తెలిసిందే. కాని ఇప్పుడు రెండు ఏనుగులతో టీవికె పార్టీ జెండా తమ పార్టీ జెండాను పోల్చి ఉండటం తమకు అభ్యంతరకరం అని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా రాజకీయ జెండాలు, ఎన్నికల గుర్తులపై ఇలాంటి ఫిర్యాదులు చాల జరిగాయి. ఈసారి ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి.