అన్నయ నుంచి బ్రదర్స్ డే విషెష్

ఇళ్లు బాగు పడాలి అంటే ఇంటి పెద్ద బాగుండాలి, పెద్ద కొడుకు ప్రయోజకుడు అవ్వాలి అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి అవుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే మెగాస్టార్ ఫ్యామిలీని చూపిస్తే సరిపోతుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మెగాస్టార్ గా ఆయన ఎదిగిన తీరు, కొణిదెల కుటుంబానికి ఆయన చూపించిన దారి తిరుగులేనిది. అన్నయ్య బాటలో నడిచిన చిన్న తమ్ముడు పవర్ స్టార్ గా మరి తెలుగు సినీ బాక్సాఫీస్ నే శాసిస్తున్నాడు. మరో తమ్ముడు నాగబాబు, నవ్వుల బాబుగా మరి టీవీ ప్రేక్షకులకి దెగ్గరయ్యాడు. రామ లక్ష్మణులు ఇద్దరే కానీ వీరు మాత్రం ముగ్గురు… అన్న మాట జవదాటని తమ్ముళ్లు, తమ్ముళ్ల ప్రేమకి కట్టుబడిన అన్నయ్య. ఒకరికి కష్టం వస్తే మిగిలిన ఇద్దరూ అండగా నిలబడతారు, ఒకరికి సంతోషం వస్తే మిగిలిన ఇద్దరూ పంచుకుంటారు. అందుకే అన్న తమ్ముల బంధానికే ఆదర్శం ఈ ముగ్గురు. నేడు బ్రదర్స్ డే సంధర్భంగా తన తమ్ముళ్ల పాత ఫోటోని పోస్ట్ చేసిన మెగాస్టార్, తోడ బుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి, Happy Brothers Day!” అంటూ ట్వీట్ చేశారు. అటు చిరంజీవి ఇటు నాగబాబు మధ్యలో పవన్ కళ్యాణ్… ఈ ఫొటోలో ఉన్నట్లే ఈ కొణిదెల బ్రదర్స్ ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుందాం.