ఇండియాలోనే ఇదే భారీ బడ్జెట్ సినిమా

ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాను డిస్నీ సంస్థతో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటుడు కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా. త్వరలో షూటింగ్ కూడా ముగియనుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ కాంబినేషన్‌లో ఈ సినిమా రానుండగా.. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

bramastra

మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు బ్రహ్మస్త్ర అనే టైటిల్ కన్పామ్మ్ అయింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దీనికి తెరకెక్కిస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా చరిత్రలోనే బాహుబలి, సాహో సినిమాలను అత్యధిక బడ్జెట్‌తో నిర్మించారు.

ఇప్పుడు ఆ సినిమాల బడ్జెట్‌కు మంచి బ్రహ్మస్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో..