బ్రహ్మానందం వెహికల్‌పై రూ.14895 చలాన్

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం తాజాగా తన బర్త్‌డేను జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనను కలిసి విషెస్ చెప్పేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్‌పై బ్రహ్మానందం స్పందించాడు. తనపై వస్తున్న మీమ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందని, సినిమాల్లో నవ్వించిన తాను… ఇప్పుడు ఇలా కూడా నవ్విస్తున్నందుకు హ్యాపీగా ఉందన్నాడు.

BRAMANANDAM CAR CHALLAN

అయితే ఈ వీడియోలో బ్రహ్మానందం వెనుక ఆయన కారు కూడా ఉంది. దీంతో నెటిజన్లు ఆయన కారుపై చలాన్ ఎంత ఉందో నెట్‌లో సెర్చ్ చేశారు. దీంతో బ్రహ్మానందం కారుపై రూ.14895 చలాన్ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ బ్రహ్మానందం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.