బ్ర‌హ్మాస్త్ర` టైటిల్ లోగోను విడుద‌ల చేసిన స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ `బ్ర‌హ్మాస్త్ర‌`. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ఈ మైథిలాజిక‌ల్ ఫ్యూజ‌న్ డ్రామా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా తెలుగు, త‌మిళ టైటిల్ లోగోల‌ను స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఇటీవ‌ల ప్ర‌యాగ‌లో 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో `బ్ర‌హ్మాస్త్ర` అనే లోగోను ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబ‌ర్ 25, 2019న హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది.