మీరు మోస‌పోయారా? అయితే బ్ర‌హ్మ‌నందం మీమ్స్‌ను చూడండి: హైద‌రాబాద్ పోలీసులు

Hyderabad: సైబ‌ర్ నేర‌గాళ్లు వ‌ల‌లో ప‌లు ర‌కాలుగా ఎంతో మంది మోస‌పోతున్నారు. ఇప్పుడు ఇలాంటి నేరాలు ఎక్కువ‌వుతున్నాయి.. ఇటీవ‌లే టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల సైబ‌ర్ నేరగాళ్ల వ‌ల‌లో మోస‌పోయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న తెర‌కెక్కించిన భీష్మ చిత్రానికి ఓ అవార్డుకు ఎంపిక జరుగుతుంది.. దీనికి కొంత డ‌బ్బు కావాల‌ని ఓ వ్య‌క్తి వెంకీ కి తెలిపాడు.. దీంతో ఆయ‌న మొత్తం 63వేల రూపాయ‌లు ఇచ్చి.. త‌ర్వాత తాను మోస‌పోయాన‌ని అనుకుని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

Brahmy Meme

కాగా Hyderabadహైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు.. స‌మాజంలో జ‌రుగుతున్న మోసాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు న‌గ‌ర పోలీసు శాఖ సినీ ప్ర‌ముఖుల మీమ్స్‌తో వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ వేదిక‌గా ఉద్యోగాల పేరుతో జ‌రుగుతున్న మోసాల వ‌ల‌లో ప‌డి.. చివ‌రికి ఆ బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో అలాంటి మోసాల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పిస్తూ.. టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ బ్రహ్మ‌నందం న‌టించిన ప‌లు చిత్రాల్లో కామెడీ స‌న్నివేశాల‌ను తీసుకుని మీమ్‌ను త‌యారు చేశారు. ఈ ప్ర‌త్యేక వీడియోను హైద‌రాబాద్ సిటీ పోలీసు విభాగం ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసిందిHyderabad. ప్ర‌స్తుతం బ్ర‌హ్మ‌నందం మీమ్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.