‘పంచంతంత్రం’ సినిమాలో వేద‌వ్యాస్‌గా ‘బ్ర‌హ్మానందం’!!

తెలుగు తెర‌పై ఎన్నో విల‌క్షణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులకు న‌వ్వుల‌ను పంచిన హాస్య‌బ్ర‌హ్మ బ్రహ్మానందం పంచంతంత్రం సినిమా కోసం క‌థ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు.బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, సృజ‌న్ ఎర‌బోటు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్ర‌హ్మానందం ఫ‌స్ట‌లుక్‌ను శ‌నివారం విడుద‌ల‌చేశారు.

ఇందులో ఆయ‌న వేద‌వ్యాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. క‌థ‌కుడు రెడీ అంటూ మైక్ ముందు మాట్లాడుతున్న బ్ర‌హ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. న‌వ్వించ‌డ‌మే కాదు అవ‌స‌ర‌మైతే సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్ష‌కుల చేత క‌న్నీళ్లు పెట్టించ‌గ‌ల‌రు. త‌న న‌ట‌న‌తో మ‌న‌సుల్ని క‌దిలించ‌గ‌ల‌ర‌ని చాటిచెప్పేలా బ్ర‌హ్మానందం పాత్ర ఉంటుంది.

నిర్మాత‌లు లో ఒక్కరు అయిన అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, మాట్లాడుతూ రెండేళ్ల విరామం త‌ర్వాత బ్ర‌హ్మానందం న‌టిస్తున్న చిత్ర‌మిది. గ‌తంలో కొన్ని స‌న్నివేశాల‌ను ఆయ‌న‌పై తెర‌కెక్కించాం. ఇటీవ‌ల ప్రారంభ‌మైన షెడ్యూల్‌లో బ్యాలెన్స్‌గా ఉన్న స‌న్నివేశాల‌ను పూర్తిచేశాం. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నాం. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. కామెడీ క్యారెక్ట‌ర్‌కు భిన్నంగా స‌రికొత్త పాత్ర‌లో బ్ర‌హ్మానందం క‌నిపించ‌బోతున్నారు. డ్రామా, సెంటిమెంట్ అంశాల‌తో హృద‌యాల్ని హ‌త్తుకునేలా ఉంటుంది. వేద‌వ్యాస్‌గా ఆయ‌న పాత్ర సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ పంచ‌తంత్రం క‌థ‌, పాత్ర‌ల‌ను వివ‌రించే క‌థ‌కుడిగా బ్ర‌హ్మానందం క‌నిపిస్తారు. న‌టుడిగా ఆయ‌న్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించే సినిమా ఇది అని చెప్పారు.

నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక