మాటల మాంత్రికుడి రూట్ లో ఊరమాస్ డైరెక్టర్

తన సినిమాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి, హీరోలతో అదిరిపోయే డైలాగులు చెప్పించి మాస్ ని మెప్పించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బోయపాటి నుంచి సినిమా వస్తుంది అంటేనే బీ, సీ సెంటర్లు విజిల్స్ మోతమోగిపోతాయి అందుకే అతనికి ఫ్లాప్స్ తక్కువ. ఒక సినిమా నిరాశపరిచినా కూడా నెక్స్ట్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యే బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సినిమా కోసం కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నాడు. విమర్శించిన వాళ్లతోనే కాంప్లిమెంట్స్ పొందాలని చూస్తున్న బోయపాటి, హిట్ కొట్టాలనే కసితో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నాడు.

boyapati srinu

గతేడాది అరవింద సమేత సినిమా వరకూ మాటల మాంత్రికుడిగా అందరితో మన్ననలు అందుకున్న త్రివిక్రమ్ పై ఒక్క సినిమా కారణంగా చాలా విమర్శలు వినిపించాయి. త్రివిక్రమ్ పని అయిపోయిందన్న వారూ కూడా ఉన్నారు. కెరీర్ మొత్తంలో విమర్శ అనే మాటే ఎరుగని త్రివిక్రమ్, సరిగ్గా 10 నెలల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత వీర రాఘవ చేశాడు. తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటూ ఎన్టీఆర్ ని ముందెన్నడూ చూడని విధంగా చూపించిన త్రివిక్రమ్ భారీ హిట్ అందుకున్నాడు. విమర్శించిన వాళ్లే అరవింద సమేత సినిమా చూసి త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అన్నారు.

ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవ్వాలని చూస్తున్న బోయపాటి శ్రీను, బాలయ్య సినిమాని స్ట్రాంగ్ కంటెంట్ తో రెడీ చేసి, నెక్స్ట్ సమ్మర్ టైంకి హిట్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథని, లెజెండ్ ని మించే కమర్షియల్ సినిమాని ఇవ్వాలని భావించిన బోయపాటి శ్రీను, అందుకు తగ్గట్లు గానే కథని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరి నందమూరి హీరోతో త్రివిక్రమ్ కంబ్యాక్ ఇచ్చినట్లే బోయపాటి శ్రీను కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.