కోలీవుడ్ లో బాక్సాఫీస్ వార్ మొదలయ్యింది…

కోలీవుడ్ లో దీపావళి బాక్సాఫీస్ వార్ వేడెక్కుతోంది. ఇప్పటికే దళపతి విజయ్, అట్లీతో చేస్తున్న బిగిల్ సినిమాని రేస్ లో నిలబెట్టాడు. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో బిగిల్ పై ఆకాశాన్ని తాకే అంచనాలున్నాయి. బిగిల్ వేడికే తట్టుకునే పరిస్థితి కనిపించని సమయంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే కార్తీ, ఖైదీ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఖైదీ క్రైమ్ డ్రామా అయినా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత, కథలో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉన్నట్లు కనిపించడంతో ఫ్యామిలి ఆడియన్స్ కూడా సినిమాని ఆదరించే అవకాశం కనిపిస్తోంది.

karthi vijay

ఉన్న 1000 థియేటర్లు ఇక్కడికే అయిపోతాయి అనుకుంటే ఈ గ్యాప్ లో విజయ్ సేతుపతి కూడా రంగంలోకి దిగుతూ సంగ తమిళన్‌ సినిమాని రిలీజ్ కి రెడీ చేశాడు. ఈ దీపావళికి మూడు సినిమాల విడుదలతో ఓపెనింగ్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎంత కంటెంట్ బాగున్నా కూడా థియేటర్స్ దొరకవు కాబట్టి సంగ తమిళన్‌ సినిమాని దీపావళి రేస్ నుంచి సైడ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. విజయ్ సేతుపతి సైడ్ అయ్యాడు కాబట్టి ఇక పోటీ బిగిల్ అండ్ ఖైదీ మధ్యలోనే ఉంటుంది. మరి ఈ ఇద్దరిలో దీపావళికి లక్ష్మీ బాంబ్ లాంటి హిట్ ఇచ్చేది ఎవరో చూడాలి.