Bollywood: బాలీవుడ్‌కు ఉప్పెన మూవీ‌.. వైష్ణ‌వ్‌తేజ్ పాత్ర‌లో షాహిద్ త‌మ్ముడు!

Bollywood: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ డెబ్యూ చిత్రం ఉప్పెన‌.. టాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో డెబ్యూ హీరోగా వైష్ణ‌వ్‌తేజ్ రికార్డులు సృష్టించాడు. అలాగే తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి ప్రేక్ష‌కుల‌ను ఎంతో మెప్పించింది. త‌న అందంతో పాటు త‌న హావాభావాలు ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను ఎంతో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి విల‌న్ పాత్ర చేసి ప్రేక్ష‌కులకు మ‌రింత హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంతో టాలీవుడ్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన బుచ్చిబాబు సానాకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు వ‌చ్చింది. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపే క‌లెక్ష‌న్ల‌ను సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమాను ప‌లు భాష‌ల్లో రీమేక్ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఆయా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో త‌మిళంలో కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు జేస‌న్ విజ‌య్ కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌డానికి ఉప్పెన చిత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు బాలీవుడ్‌లోనూ ఈ సినిమా రీమేక్ కానుంద‌ట‌. ఈ సినిమాలో వైష్ణ‌వ్‌తేజ్ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్‌క‌పూర్ త‌మ్ముడు ఇషాన్ క‌ట్టార్ చేయ‌నున్నాడని బాలీవుడ్ వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఇక ఉప్పెన Bollywoodబాలీవుడ్ రీమేక్‌లో ఇషాన్ క‌ట్ట‌ర్ జోడీగా అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌. వీరిద్ద‌రు క‌లిసి ఖాలీ పీలీ అనే సినిమాల్లో న‌టించారు. దీంతో వీరికి ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.