Bollywood: ఆర్ఎక్స్‌100 బాలీవుడ్ రీమేక్‌.. ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌!

Bollywood: టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఎక్స్100. నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెరెకెక్క‌గా… ఇందులో ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన కార్తికేయ‌, పాయ‌ల్‌రాజ్‌పుత్‌ల‌కు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించ‌గా.. ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రం ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఈచిత్రంపై ప‌లు భాష‌ల్లో రీమేక్ చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాతలు భావించారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్‌లో ఈ చిత్రం రీమేక్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా ఆర్ఎక్స్100 చిత్రాన్ని బాలీవుడ్‌లో Bollywoodత‌డ‌ప్ టైటిల్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

Ahanshetty

ఇందులో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కొడుకు అహాన్‌శెట్టి హీరోగా న‌టిస్తున్నాడు.. ఈ చిత్రంతో అహాన్ శెట్టి బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమ‌వుతున్నాడు. అలాగే అహాన్ శెట్టి జోడీగా తారా సుతారియా హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌యూనిట్‌. ఇందులో హీరో గాయాల‌తో హీరోయిన్‌ను రొమాంటిక్ గా హ‌గ్ చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక ఇంక్రిడ‌బుల్ ల‌వ్ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌తో మిల‌న్ లుత్రియా ద‌ర్శ‌క‌త్వంలో Bollywoodఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ఆ చిత్ర పోస్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత న‌దియాద్వాలా నిర్మిస్తున్నారు. ‌