వైశ్యగా సోనాక్షి… సినిమాలో మాత్రం కాదు

వైశ్య పాత్రల్లో నటించిన వారికి నటన అండ్ గ్లామర్ పరంగా మంచి పేరు వస్తుంది. తెలుగులో ఛార్మీ, అనుష్క లాంటి స్టార్స్ ఈ పాత్రల్లో నటించిన మెస్మరైజ్ చేశారు. ఇటివలే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి అలియా భట్ ని పెట్టి గంగుభాయి అనే సినిమా కూడా చేశాడు. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. అలియా భట్ గంగుభాయి పాత్రలో మెప్పిస్తుంది, ఈ మూవీతో ఆమెకి నేషనల్ అవార్డు కూడా వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెరపై కనిపించే వైశ్య పాత్రలకి ఇంత పేరు వస్తుంది. ఈ బాటలో నడుస్తూ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా వైశ్య పాత్రలో కనిపించడానికి రెడీ అవుతోంది. అయితే అది తెరపై కాకపోవడం విశేషం. ఎప్పుడూ సినిమాలతో అలరించే సోనాక్షి, ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది. సోనాక్షి నటిస్తున్న ఈ సిరీస్ ని గంగుభాయి తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ చేయనున్నాడు. ‘హీరా మండి’ అనే పేరుతో రూపొందించనున్న ఈ సిరీస్… పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.

సెక్స్ వర్కర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే కాన్సెప్ట్ తో సిరీస్ కొనసాగుతుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషీని ఓ లీడ్ వేశ్య రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం సోనాక్షిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందట. కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సోనాక్షి అంగీకరించినట్లు తెలుస్తోంది. వేశ్యగా కనిపించడంతో పాటు కథక్ డాన్సర్ గా కూడా కనిపించాల్సిన అవసరం ఉండడంతో సోనాక్షి కథక్ నేర్చుకునే పనిలో పడ్డారు. మంచి నటిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న సోనాక్షి ఈ హీరా ముండిలో వైశ్యగా అందంగా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంటుందేమో చూడాలి.