బాహుబలి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన సాహూ హీరోయిన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా కొనసాగుతుంది. దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చైన్ ని కంటిన్యూ చేస్తున్నారు. సక్సస్ ఫుల్ గా క్యారీ ఫార్వార్డ్ అవుతున్న ఈ ఛాలెంజ్ లో తెలుగు నుంచి దాదాపు స్టార్స్ హీరోస్/ హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న అందరూ మొక్కలు నాటుతుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఏకంగా 1650 ఎకరాలినే దత్తత తీసుకున్నాడు. ఛాలెంజ్ ని సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని ట్యాగ్ చేశాడు. సాహో సినిమా కలిసి చేసిన పరిచయంతో శ్రద్ధ కూడా ప్రభాస్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్క నాటింది. ఈ సందర్భంగా మొక్క నాటిన ఫోటోని పోస్ట్ చేసిన శ్రద్ధ, నామినేట్ చేసిన ప్రభాస్ కి థాంక్స్ చెప్తూ…
ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.